Pooja Hegde: బుట్టబొమ్మకు సర్జరీ.. ఎంతో కాలం నుంచి ఆ నొప్పితో బాధపడుతున్న పూజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde: ఈ మధ్య పూజా హెగ్డేకు అసలు కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆ మధ్య వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బుట్టబొమ్మ సడెన్ గా వెనుకబడిపోయింది. ఆమె సినిమాలు హిట్ కాకపోవడంతో పూజాను పట్టించుకోవడం మానేశారు దర్శక నిర్మాతలు. ఇక కొన్ని సినిమాలను ఆమెను తీసుకున్నప్పటికీ మధ్యలోనే ఆ సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. అయితే పూజానే సినిమాల నుంచి తప్పుకుందో లేక ఆమెను కావాలనే తప్పించారో సరిగా క్లారిటీ లేదు. మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో ఈ ముద్దుగుమ్మ నటించాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ సరసన మహర్షిలో నటించి హిట్ కూడా అందుకుంది ఈ చిన్నది. అయితే ఏమయ్యిందో ఏమో కానీ పూజా స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్ సినిమా నుంచి కూడా పూజా తప్పుకుంది. ఇక ప్రొఫెషనల్ కష్టాలకు తోడు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పూజాకు జత కట్టాయి.
Also Read: Maharashtra: దారుణం.. ఆ కారణంతో నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టారు
Also Read
- Pakistan: "పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం".. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
- Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
- Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
- Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్‌పై ప్రపంచ నేతల సందేశాలు..
తాజాగా పూజా హెగ్డే కాలికి సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా కాలి నొప్పితో బాధపడుతున్న పూజా తాజాగా నొప్పి మరింత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదట. అయితే ఈ విషయాన్ని పూజా సన్నిహితులు కొందరు ఇండస్ట్రీలోని వారితో పంచుకున్నారు. దాంతో ఈ వార్త బయటకు వచ్చింది. రాధేశ్యామ్, బీస్ట్ సినిమాల షూటింగ్ అప్పుడు కూడా ఆమె కాలి నొప్పితో బాధపడిందట. అయితే అప్పుడు డాక్టర్ సూచనతో కాలికి కట్టు కట్టుకొని జాగ్రత్తగా షూటింగ్ చేసిందట. అయితే ఆ తరవాత కాలి మీద ఒత్తిడి పడటం అంత మంచిది కాదని వైద్యులు చెప్పడంతోనే ప్రస్తుతం సైన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుందట. అంతేకాని తనను ఎవరు తప్పించలేదని టాక్ నడుస్తుంది. అయితే తన కాలికి సర్జరీ జరిగిందని అందరితో పంచుకోవడం పూజాకి ఇష్టం లేదని అందుకే గోప్యంగా ఉంచిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా పూజా కాలికి గాయం అయ్యిందని ఆమెకు సర్జరీ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆమె సన్నిహితులు ఖండించారు. అయితే ఈసారి ఇంతవరకు పూజాకు సర్జరీ అన్న వార్తపై ఎవరు స్పందించలేదు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Pakistan: “పాకిస్తాన్‌లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
-
Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
-
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
-
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
-
CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!