Pooja Hegde : భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన బుట్టబొమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde : ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అలా వైకుంఠపురం సినిమాల్లో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కొన్నాళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఒక్కసారిగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులతో బుట్టబొమ్మ రేసులో వెనకపడిపోయింది. ఆమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో తెలుగులో శ్రీలీలకి డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. అంతేకాదు గుంటూరు కారం సినిమా నుంచి గురూజీ కూడా తప్పించగా.. తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది పూజా హెగ్డేకు.
Read Also:Kanaka Durga Temple: మహిషాసురమర్ధినిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
Also Read
తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళూరు భామ పూజా హెగ్డే వరుస ఫ్లాపులు ఆమెకు ఎదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా కెరీర్‌లో విజయం కోసం ప్రయత్నాలు చేస్తుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపుతిప్పుతుందనే ఆశాభావంతో ఉంది పూజాహేగ్డే.
Read Also:MS Dhoni: ఓడినా, గెలిచినా.. అతడు తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు: ధోనీ
గతంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసే ఆమె ప్రస్తుతం కాస్త దిగి వచ్చిందట. దళపతి విజయ్ సినిమాకు రెమ్యునరేషన్ భారీగా తగ్గించి తీసుకుందని తెలిపింది. ప్రస్తుతం పూజాహెగ్డేకు తమిళం, హిందీల్లో అవకాశాలు బాగానే వస్తున్నా.. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయలేదు. తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా ఈ భామనే హీరోయిన్ గా ఖరారైంది. ఈ రెండు చిత్రాలు తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని, తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉంది పూజాహెగ్డే. ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఆమె తన బాయ్‌ఫ్రెండ్ రోహన్‌తో తరచూ తిరుగుతూ ఉంటుంది. పూజా హెగ్డే చాలాసార్లు కెమెరాకు చిక్కింది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!