బుట్టబొమ్మ పూజా హెగ్డేకి టాలీవుడ్‌లో ఈ మధ్య టైమ్ అస్సలు కలిసి రావట్లేదు. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగులో ఆఫర్లు తగ్గాయి. స్టార్ హీరోలే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చినా పూజా మాత్రం అస్సలు తగ్గట్లేదు. తమిళ, హిందీ పరిశ్రమలు ఈమెకు అండగా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’, రాఘవ లారెన్స్‌తో ‘కాంచన 4’ చేస్తూ బిజీగా ఉంది. అటు బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి ‘హై జవాని తో ఇష్క్ హోనా హై’ సినిమాలో నటిస్తూ తన స్టార్ ఇమేజ్ కోసం గట్టిగానే ట్రై చేస్తుంది.ఇక తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్ ఏంటంటే..
Also Read : Salaar 2 Update : సలార్-2’పై ప్రశాంత్ నీల్ బిగ్ క్లూ..
చాలా కాలం తర్వాత పూజా హెగ్డే మళ్ళీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నెలకుడితి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో పూజా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈమె తన గ్లామర్‌ని, యాక్టింగ్‌ని నమ్ముకుని ఈ సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు సౌత్ ఇండియాను ఊపేసిన ఈ బుట్టబొమ్మ, ఇప్పుడున్న ఈ నాలుగు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా మళ్ళీ స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా. తన కాన్ఫిడెన్స్ ఏమాత్రం కోల్పోకుండా, అవసరమైతే టైర్-2 హీరోలతో కూడా నటించేందుకు రెడీ అంటోంది. మరి ఈ లైనప్‌తో పూజాకి మళ్ళీ పాత రోజులు వస్తాయో లేదో చూడాలి!
