“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే, తరువాత వచ్చిన “రాధేశ్యామ్”, “ఆచార్య” సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో, తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. దీంతో పూజా హగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా. లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ” సినిమాలోని “మోనికా” సాంగ్ తో పూజా మరోసారి స్పాట్‌లైట్‌లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్‌లో మారుమోగింది. గ్లామర్, గ్రేస్, ఎక్స్‌ప్రెషన్ అన్ని మళ్లీ పూజా బ్రాండ్ ను రిమైండ్ చేశాయి.
Also Read : LokeshKanagaraj : హీరోగా లోకేష్ కనకరాజ్ సినిమా.. నేడే సినిమా షూటింగ్ స్టార్ట్
ఇప్పుడు పూజా హెగ్డే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా DQ41 లో హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే పూజా హెగ్డే, నానితో కలిసి నటించబోతోందట తన “రెట్రో” ప్రమోషన్స్ సమయంలో నానితో కలసి పని చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది పూజా. ఇప్పుడు ఆ కల నిజమవబోతోందట. “ఓజీ” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా రాబోయే డార్క్ కామెడీ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిందంటే ఈ కొత్త కాంబినేషన్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. టాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్న పూజా హెగ్డే, దుల్కర్, నాని లాంటి వేరే వేరే స్టైల్స్ ఉన్న హీరోలతో కలవడం ఒక కొత్త ఫేజ్ మొదలైనట్టు అనిపిస్తోంది.
