NTV Telugu Site icon

Ponnam Prabhakar : 2 లక్షల పైన రుణాలు ఉన్నవారికి మార్గదర్శకాలు వస్తున్నాయి..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌ వేములవాడ లో 300 MTS గోదాం, Kdccb వేములవాడ శాఖ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 2009 లో కరీంనగర్ ఎమ్మెల్యే కావాలని అనుకున్న వైఎస్ఆర్ ఎంపీగా పోటీ చేయాలని అన్నారని, కరీంనగర్ ఎంపీగా గెలిచా అని, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో మీ బిడ్డగా నా పాత్ర నిర్వహించానన్నారు. గంభీరావు పేట నుండి ఎల్కతుర్తి వరకు పాదయాత్ర చేశా ఎంపీ అయి కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావాలని అనుకున్నానని, హుస్నాబాద్ ఎమ్మెల్యే అయి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర మంత్రి అయ్యానన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల బిడ్డగా మీకు ఏ ఇబ్బంది ఉన్న మీకు అండగా ఉంటానని ఆయన తెలిపారు.

Draupadi Murmu: వైద్యురాలి అత్యాచార ఘటనపై తొలిసారిగా స్పందించిన రాష్ట్రపతి
అంతేకాకుండా’తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం.. ఎవరికైనా రైతు రుణమాఫీ కాకపోతే సహకార వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తో సమన్వయం చేసి రుణమాఫీ ఇప్పించాలి.. కరీంనగర్ జిల్లా నుండి 59 వేల మంది రైతులకు 444 కోట్లు రుణమాఫీ అయింది.. 2005 లో కేంద్రంలో మన్మోహన్ సింగ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశాం. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి దశ లో లక్ష ,రెండో దశ లక్ష 50 వేలు ,మూడో దశలో రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశాం.. 2 లక్షల పైన ఉన్నవారికి మార్గదర్శకాలు వస్తున్నాయి.. సహకార సంఘాలకు విదేశీ విద్య లోన్ ఇచ్చే అర్హత లేదు అన్నారు..కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సహకార సంఘాల రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకొనచడానికి సహకార సంఘం నుండి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నుండి కోరుతాం.. వాణిజ్య బ్యాంకుల కంటే సహకార బ్యాంకులు ఇచ్చే గృహ లోన్ ప్రధాన మంత్రి అవస్ జన, గతంలో ఇందిరమ్మ అవాస యోజన ఉన్నట్టు బ్యాంకుల నుండి కూడా ఏర్పాటు చేస్తాం.. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలకు తావు లేకుండా సహకార సంఘం లో రైతుల హితం కోసమే మనం పని చేయాలి. రవాణా శాఖ మంత్రి అయిన తొలి రోజే తెలంగాణ లో మహిళలు ఆర్టీసి లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.. 265 రోజుల్లో 85 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు..

PM Modi: ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’కు పదేళ్లు.. 53 కోట్ల ఖాతాల్లో రూ. 2లక్షల కోట్లు

2500 కోట్ల రూపాయలు విలువైన ప్రయాణాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం. వేములవాడ లాంటి ప్రాంతాల్లో సహకార సంఘాలు 150 కోట్ల వ్యాపారం చేస్తున్నారు.. 35 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. సహకార రంగానికి అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తాం.. యావత్ తెలంగాణ లో 70 శాతానికి పైగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారు.. 500 కి గ్యాస్ అందిస్తున్నాం. ఎవరికైనా రాకపోతే మండల స్థాయి కార్యాలయాల్లో అప్లికేషన్ ఇవ్వండి.. 10 లక్షల ఆరోగ్య శ్రీ చేశాం.. 17 తారీఖు నుండి ప్రజా పాలన ప్రారంభం అవుతుంది. ఆరోగ్య శ్రీ కార్డు లు వస్తున్నాయి.. తిరుపతి లో నిత్యాన్నదాన పథకం ఉంటుందో వేములవాడ లో కూడా రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నాం.. మాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్న.. దానికి సహకార బ్యాంక్ ,రైతులు ,స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.. ఆ శివుడి ఆజ్ఞ మేరకు మీ అందరినీ ప్రార్థిస్తున్నా..’ అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.