Site icon NTV Telugu

Ponnam Prabhakar : అధికారాలను వికేంద్రీకరణ ద్వారా ముందుకు వెళదాం

Ponnam

Ponnam

శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నామని, కానీ గత పది సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని, ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలను పటిష్ట పరిస్తే ఇప్పుడు 10 సంవత్సరాలుగా పంచాయతీలను నిర్వీర్యం చేశారన్నారు పొన్నం ప్రభాకర్‌. అంతేకాకుండా.. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో ప్రతినిధులకు సంబంధం లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ద్వారా మీనాక్షి నటరాజన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Alahabad High Court : వివాహిత ముస్లిం మహిళ సహజీవనం చేయడం నిషేధం.. పిటిషన్ కొట్టేసిన కోర్టు

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుండి ఎంపిగా అయిన తరువాత నేను కరీంనగర్ నుండి ఎంపీగా ఒకేసారి గెలిచామని, వారు పార్లమెంట్ లో తెలంగాణ కోసం మాకు మద్దతుగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ద్వారా మరింత ముందుకు వెళదామన్నారు. అధికారాలను వికేంద్రీకరణ ద్వారా ముందుకు వెళదామని, పంచాయతీ రాజ్ లో ,మున్సిపాలిటీ లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చట్టాలు ఉంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ధరణి ప్రాబ్లమ్స్ ,అటవీ రక్షణ , ప్రకృతి చర్యల పై మరింత ముందుకు వెళ్లాలని, క్షేత్ర గ్రామీణ స్థాయి సంఘటన్ ద్వారా కార్యక్రమాలను తీసుకుపోవాలన్నారు. మీ అందరి సహకారం తో nsui అధ్యక్షుడి నుండి ఈరోజు మంత్రి వరకు అయ్యానన్నారు. ఇప్పటి వరకు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారో మీ హక్కుగా రావాల్సిన వాటిపై మీకు అండగా ఉంటా అని మాట ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Vemireddy Prabhakar Reddy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేమిరెడ్డి దంపతులు

Exit mobile version