కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో కార్యకర్తల సమావేశానికి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను పక్క గా అమలు చేస్తాం.. వాటి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి నెల కాలేదు 420 ముద్ర వేసి ప్రచారం చేయడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. సెక్షన్ 379 ,384 ,393 395 సెక్టన్లు బిఆరెస్ నాయకులకు అప్లికేబుల్ అవుతాయని, స్లిప్పర్ చెప్పులతో వచ్చిన వారికి వందల కోట్ల ఫామ్ హౌజ్ లు ఎలా వచ్చాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 7లక్షల కోట్ల అప్పు చేసింది బిఆరెస్ ప్రభుత్వమని, కేసీఆర్ ప్రతిపాదిస్తే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారు… కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆటో డ్రైవర్లు మా కుటుంబ సభ్యులు అని, మహిళలకు బస్ ఉచిత ప్రయాణం Brs కి ఇష్టం ఉందా లేదా…..ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారన్నారు. ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ పోయాయి ఇప్పటివరకు అని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టే పరిస్థితి ఉంది.. రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదుని, దేవాదుల, ఎస్సారెస్పీ ద్వారా నీరందించే పనులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో మెట్రో, ఓలా తదితర సౌకర్యాలతో అటోవాలాలు ఇబ్బందులు పడలేదా, అది అప్పుడు గుర్తుకు రావడం లేదా అన్నారు. స్లిప్పర్ చెప్పులు వేసుకొని వచ్చిన వారికి వందల ఏకరాల ఎలా వచ్చాయన్నారు. కాళేశ్వరం బీట్లు పడి ఉందని,మళ్లీ నిర్మాణం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు.ప్రజలు ఇబ్బంది పడకుండా వుండాలని నేనే ఈ రోజు వచ్చానని,మళ్ళీ వచ్చి ప్రభుత్వ అధికారులతో సమీక్ష చేస్తానని తెలిపారు.