Ponnam Prabhakar : హనుమకొండ జిల్లాలో 3వ ఎడిషన్ క్రేడాయి వరంగల్ ప్రాపర్టీ షోను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రేడాయి ప్రాపర్టీ షో మూడవ ఎడిషన్ వరంగల్ లో విజయవంతంగా నిర్వహిస్తున్న క్రేడాయి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు సిటీ లు కలిసి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు మంత్రి పొన్నం. ఇటీవలే ఈ ప్రాంతంలో ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి అభివృద్ది పనులు చేపట్టారని, ప్రాపర్టీ షో జరుగుతుంది అంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత వాసులు తాము కోనాలనుకున్న ప్రాపర్టీ ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనకి నచ్చింది తీసుకోవచ్చన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తర దక్షిణ భారతదేశంలో కలిపే రైల్వే జంక్షన్లు వరంగల్ లో ఉన్నాయని, రాబోయే కాలంలో వరంగల్ నగరానికి ఎయిర్‌పోర్ట్ రాబోతుందని, వైద్య రంగంలో కాకతీయ మెడికల్ కాలేజి ఎంజీఎం లాంటి ప్రభుత్వ హాస్పిటల్ లు ఉన్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కాకతీయ యూనివర్సిటీ , నిట్ లాంటి విద్యాసంస్థలు ఉన్నాయని, టెంపుల్ టూరిజం లో సమ్మక్క సారలమ్మ ఆలయం , రామప్ప ఆలయం ,వెయ్యి స్థంభాల గుడి ఉన్నాయన్నారు. వరంగల్ హనుమకొండ కాజీపేట లో మరింత అభివృద్ధి చెందడానికి చుట్టూ జాతీయ రహదారులు ఉన్నాయని, క్రేడాయి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానన్నారు. నియోజకవర్గ రెండు మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి..నేను జిల్లా మంత్రిగా మీకు అండగా ఉంటానని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ ఛైర్పర్సన్ బండా ప్రకాశ్ , ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,వరంగల్ మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ ,ఇనగాల వెంకట్ రామిరెడ్డి , క్రేడాయి ప్రతినిధులు పాల్గొన్నారు.
South Central Railways : ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన దక్షిణ మధ్య రైల్వే..