రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ లో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతన ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిధిగా హాజరై ఆర్టీఏ నూతన కార్యాలయాన్ని రవాణా & బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే. శశాంక్, జడ్పి చైర్మన్ తీగల అనితారెడ్డి, తుర్కాయంజల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బుద్ధా ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జేటీసీ లు రమేష్, మమతా ప్రసాద్,ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, డీటివో వేణు, ఆర్టీవో రఘునాధ్ గౌడ్, దయానంద్, రామోజీ సంస్థల విజయేశ్వరి, తదితరులు పాల్గన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కి పూర్ణకుంభంతో పురోహితులు ఘన స్వాగతం పలికారు. కార్యాలయ ప్రారంభం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్రెడీ రంగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రవాణా శాఖ అధికారులతో కలిసి రోడ్ సేఫ్టీ పోస్టర్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 6 ఎకరాల స్థలం లో రామోజీ సంస్థల సహకారంతో 2.5 కోట్ల తో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించుకున్నామన్నారు. 2014లో 71 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు కోటి 60 లక్షల వాహనాలు దాటాయన్నారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని, వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో రోడ్ సేఫ్ట్ కార్యక్రమాలు ముఖ్యమైనవన్నారు.
అంతేకాకుండా.. ‘గత సంవత్సరం 22 వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే 3 వేల మంది మృతి చెందారు.. రవాణా శాఖ కార్యాలయంలో లైసెన్స్ , ఇన్సూరెన్స్ ,ఇతర సేవలు అందిస్తున్నాం.. రవాణా శాఖ కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ , రిజిస్ట్రేషన్ ఇతర సేవలు భవిష్యత్ లో మరింత వేగంతో ముందుకు తీసుకుపొతం.. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం.. ఇప్పటి వరకు 9 కోట్ల మంది మహిళలలు ఉచిత ప్రయాణం చేశారు.. మొన్న సంక్రాంతి కి మహిళలకు ఉచితంగా ప్రయాణం అందించాం.. మేడారం జాతర కి కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.. సెక్రటేరియట్ లో సాయంత్రం 4 గంటలకు ఆటో డ్రైవర్ సంఘల తో సమావేశాన్ని ఏర్పాటు చేసాం.. ఓల, ఉబెర్ ,మెట్రో వచ్చినప్పుదు లేని ఆందోళనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి.. ఆటో డ్రైవర్లను ఎవరు రెచ్చగొడుతున్నారు.. ఆటో వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము.. వారి సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రతిపక్ష నేతలకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేదా..? మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ.. అమలు చేసాం.. మహిళా సాధికారత కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఇందిరమ్మ ఇల్లు అయిన , రేషన్ , గ్యాస్, ఏ కార్యక్రమం చేపట్టిన మహిళలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలతొ దేశ వ్యాప్తంగా లారీలు సమ్మె చేసాయి.. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు.. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. కొత్త చట్టాలు రాష్ట్ర పరిధిలో రావు.. ప్రజలను ఇబ్బందులు పెట్టద్దు..మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం.. రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఋణం తీర్చుకుంటాం..