NTV Telugu Site icon

Ponnam Prabhakar : యువత కాంగ్రెస్‌తో కలిసి రండి.. కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడదాం

Ponnam Prabhaker

Ponnam Prabhaker

ఉద్యోగ నియామక క్యాలండర్ ఇవండి అంటే ఇవ్వలేదని, కేసీఆర్ కి తన కూతురు ఆరు నెలలు కూడా ఉద్యోగం లేకుండా చూడలేక పోయారంటూ విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఎంపీగా ఓడిపోతే కవితను ఎమ్మెల్సీని చేశారని, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరని ఆయన మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, యువత కాంగ్రెస్‌తో కలిసి రండని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడదామని పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.

Also Read : Virat-Gambhir Fight: కోహ్లీ తిట్టిన ఆ బూతే.. గొడవకు ఆజ్యం పోసిందా?

మంత్రి గంగుల కమలాకర్ తడిసిన ధాన్యం కొనను అంటున్నారని, కేసీఆర్ తడిసిన ధాన్యం కొనాలి అని చెప్పారన్నారని, ఇద్దరిలో ఎవరి మాట నిజమని పొన్నం ప్రశ్నించారు. రైతుల ధాన్యం మాత్రం మార్కెట్లో వర్షానికి తడుస్తుందని, రైతులు రోడ్డున పడుతుంటే… సిగ్గుందా మంత్రులకు అని ఆయన ధ్వజమెత్తారు. రైతులు నష్టపోతే ఊరుకొమని పొన్నం వ్యాఖ్యానించారు. రైసు మిల్లుల వద్ద రైతుల దోపిడీ జరుగుతుందన్నారు. దమ్ముందా గంగులా వస్తావా… రైతుల దగ్గరికి పోదామని ఆయన సవాల్‌ విసిరారు. సీఎం మాట అంటే జీవో.. నష్టపోయిన రైతుకు ఎకరాకు 10 వేలు ఇస్తాం అన్నాడు కేసీఆర్.. ఇంకా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

Also Read : Talasani Srinivas Yadav : ఆ దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించాలి