Site icon NTV Telugu

Ponnam Prabhakar : త్వరలో రేషన్ కార్డులు అందజేస్తాం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar : కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే ఎల్లంపల్లి నుంచి నీరు పొదుపుగా వాడుకొని పెద్ద ఎత్తున వరి పంట పండించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఉంటే ఇప్పటికైనా క్లియర్ చేయాలని ఆయన సూచించారు. సన్న వడ్లకు బోనస్ రాకుంటే ప్రతిపక్ష నాయకులు మా దృష్టి కి తీసుకురావాలి.. రాని వారికి డబల్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చించి తప్పకుండా ఇస్తామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర లో జాతీయ పార్టీగా ప్రకటించిన బీఆర్‌ఎస్ అక్కడ ఒక సీట్ కి కూడా పోటీ చేయలేదు..గెలువలేదని, మహారాష్ట్రలో బీజేపీ గెలిస్తే సంతోషపడుతున్నారా.. కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నారా బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పాలన్నారు. బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒకటే అని, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తోందన్నారు పొన్నం ప్రభాకర్‌.

Nellore News: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి!

బీజేపీ కి బీఆర్‌ఎస్‌ బీ టీం అని ఆయన విమర్శించారు. బస్‌లలో అల్లం, ఎల్లిపాయలు పొట్టుతీస్తూ, పని లేకుండా తిరుగుతున్నారని మహిళల్ని అవమానించింది బీఆర్‌ఎస్‌ పార్టీ అని ఆయన మండిపడ్డారు. త్వరలో రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. వేములవాడ లో పెద్ద అన్నదాన సత్రం చేపట్టామని, అవాస్తవాలు ప్రచారం చేయద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి మొదటి రెండు నెలలు కరెంటు తెలువకుండా కట్ చేశారు.. అధికారులను సస్పెండ్ చేసి నట్లు టైట్ చేస్తే సెట్ అయ్యారన్నారు.

Huge Amount Drugs seize: కోస్ట్‌ గార్డ్‌ చరిత్రలోనే భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

Exit mobile version