NTV Telugu Site icon

Ponnam Prabhakar: కుల గణన ఎందుకు వద్దొ చెప్పండి?

Ponnam Prabhakar

Ponnam Prabhakar

బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ గండి కొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల లెక్క తెలియకపోవడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు నియామకాల ప్రకారం బీసీ గణన నిర్వహిస్తున్నామన్నారు. కుల గణన ఎందుకు వద్దొ నేరుగా చెప్పండని కేటీఆర్ ని ప్రశ్నించారు. జీవో18 ప్రకారం మాదిరిగానే సర్వే జరుగుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని మరోసారి స్పష్టం చేశారు.

READ MORE: Karuna Kumar: బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవడమంటే తడిశారు!

కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు పని చేస్తుందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని, అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పదవుల్లో వాళ్ల కుటుంబీకులే ఉన్నారని విమర్శించారు. ఆ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి అప్పుడు మాట్లాడాలని సవాల్ విసిరారు. అంతవరకు బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానుకోవాలన్నారు. బావా బామ్మర్దులు మాత్రమే మాట్లాడుతున్నారని.. వేరే ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నదా? అని ప్రశ్నించారు. అదొక నియంతృత్వ పార్టీ అని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందన్నారు.

READ MORE:Varun Tej: నువ్వు పెద్దోడివి అవొచ్చు..కానీ నీ సక్సెస్ దేనికీ పనికి రాదు.. వరుణ్ తేజ్ ఇలా అనేశాడు ఏంటి?

Show comments