Varun Tej: నువ్వు పెద్దోడివి అవొచ్చు..కానీ నీ సక్సెస్ దేనికీ పనికి రాదు.. వరుణ్ తేజ్ ఇలా అనేశాడు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’. ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ హిట్ అయ్యింది. ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ నిర్మాతలు విజయేంద్ర, రామ్ తాళ్లూరి ఈ సినిమాని డే వన్ నుంచి చాలా పాషనేట్ గా వర్క్ చేశారు. రిలీజ్ తర్వాత ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దామని భావిస్తున్నప్పుడు కరుణ కుమార్ మట్కా కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్. మంచి సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా అనిపించింది.
Also Read
నాలోని యాక్టర్ ని ఆయన పట్టుకున్నారనిపించింది. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నుంచి మొన్న మార్నింగ్ ఫోన్ వచ్చింది. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ గా ఉంటారు థాంక్స్ చరణ్ అన్న. మా బాబాయ్. పెదనాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతా, అది నా ఇష్టం. లైఫ్ లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు, నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు. చిరంజీవి గారు, బాబాయ్ కళ్యాణ్ గారు, నాన్న, అన్నయ్య.. వాళ్ళు నా మసన్సులో ఉంటారు, వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అని అన్నాడు. అయితే ఈ కామెంట్స్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఇక్కడ వరుణ్ ఎవరినీ ఉద్దేశించి మాట్లాడక పోయినా మెగా కాంపౌండ్ vs బన్నీ వివాదం నడుస్తోంది కాబట్టి వాటిని బన్నీకి అన్వయిస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!