Site icon NTV Telugu

Ponnam Prabhakar : వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

రజక, నాయీ బ్రాహ్మణుల‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రజక, నాయీ బ్రాహ్మణుల‌కు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణ లకు 36,526 మంది లబ్ధుదారులకూ సంబంధించిన 12.34 కోట్ల రూపాయలను 03.01.2024 నాటి వారికీ డిస్కం లకి బకాయిలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే.. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను విడుదల చేయాలని బీసీ మంత్రిత్వ శాఖ అభ్యర్థించబడిందని ఆయన వెల్లడించారు. లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు మరియు హెయిర్ కటింగ్ సెలూన్‌లకు విద్యుత్ సరఫరాను డిస్‌కనెక్ట్ చేయవద్దని బీసీ మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రజక, నాయి బ్రాహ్మణ ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సెలూన్ లకి, లాండ్రి, ధోబీ ఘాట్ లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు.. ఎవరు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు.

Jasprit Bumrah 5 Wickets: ఆదిలోనే షాకిచ్చిన బుమ్రా.. 7వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా!

ఇదిలా ఉంటే.. సెలూన్లకు, ధోబీఘాట్లకు గత ప్రభు త్వం ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణతోపాటు పలువురు నాయకులు బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నాయీ బ్రాహ్మణులు ఎదురొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో నాయీబ్రాహ్మణ సమాజంతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై మాట్లాడతామని మంత్రి హామీ ఇచ్చినట్టు సంఘం నేతలు వెల్లడించారు. అయితే.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Dwarampudi Chandrasekhar Reddy: పవన్ కల్యాణ్‌ ఎన్ని సమీక్షలు చేసినా ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్‌

Exit mobile version