NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Ponguleti

Ponguleti

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో క్యాంప్ కార్యాలయాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఈనెల 16,17 తేదీల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. 17 సాయంత్రం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని అతిరథ మహారధులు హాజరవనున్న ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు పొంగులేటి.

Also Read : Srimukhi : తడి అందాలతో, థైస్ షోతో రచ్చ చేస్తున్న శ్రీముఖి..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి పేదవారికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం. జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలుసుకున్న ప్రజల కష్టాలు నెరవేరేలా కృషి చేస్తారు. ఇందిరమ్మ రాజ్యం మూడు నెలల్లో రాబోతుంది.” అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే.. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి అమలు కాని హామీలు గుప్పిస్తారు అని తెలిపారు. నిరుద్యోగ భృతి పేరుతో యువకులను మోసం చేశారు అని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి పేద వాడికి అండగా ఉంటామన్నారు. 500 రూపాయల కే గ్యాస్ ను అందజేస్తాం.. ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకు వస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ మాటలు నమ్మితే రాష్ట్రం అగమవుతుందని ఆయన తెలిపారు.

Also Read : Sanatan row: డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబును బర్తరఫ్ చేయాలి..