Ponguleti Srinivasa Reddy: భద్రాద్రి జిల్లా మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. అలాగే రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని.. అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పనట్లు తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో 13,500 కోట్లు రెండు విడుదల చేస్తే ఈ ప్రభుత్వం 26 రోజుల్లో 18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. ఇంకా 13 వేల కోట్లు రుణమాఫీ చేయాలని అనేక వేదికల మీద చెప్పామని తెలిపారు.
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ
ఈ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదు.. అన్నమాట ప్రకారం రాబోయే రోజుల్లో 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని.. వరద బాధితులకు 16,500 ఇంటికి, ఎకరానికి 10,500 ఈ ప్రభుత్వం ఇచ్చిందని, భద్రాద్రికి వొచ్చిన వరదల్లో జిల్లా యంత్రాంగం ప్రజలతో మమేకమై పనిచేసిందని. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు అంటూ తెలిపారు. వర్షాకాలం పూర్తి అయ్యేలోపు రాష్ట్రంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో 4,000 తగ్గకుండా మొదటి విడతలో ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు.
Jaishankar-Pakistan PM: జైశంకర్‌కు పాక్ ప్రధాని షరీఫ్ షేక్‌హ్యాండ్.. పలకరింపులు
అలాగే గత ప్రభుత్వ ఆలోచనలో ఉంటే అధికారులు పద్ధతులు మార్చుకోవాలని.. ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరుతో పేదోడి సొమ్ము కొల్లగొట్టి దాచుకొని ప్రాజెక్టు అసంతృప్తిగా వదిలేశారని ఆయన అన్నారు. పినపాక నియోజక వర్గంలో పులుసు వంతు ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని గురైన లిఫ్టులను పునరుద్దించి 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.