Telangana Congress: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గాంధీభవన్‌లో ఘనస్వాగతం లభించింది. ఈ నెలలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పొంగులేటిని రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పలువురు కీలక నేతలు చేతులు కలిపారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తొలిసారిగా ఇవాళ (మంగళవారం) గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పొంగులేటిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు.
Read also: Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన దిలావర్ పూర్ మండల రైతులు
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పొంగులేటి తొలిసారి గాంధీభవన్‌కు రావడంతో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు పలువురు నేతలు గాంధీభవన్‌కు వచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డితో పొంగులేటి సమావేశమయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికలకు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిస్తానని పొంగులేటి చాలాసార్లు సవాల్ చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం అలాగే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. పొంగులేటి పార్టీలో చేరిన తర్వాత ఖమ్మంలో కాంగ్రెస్ మరింత పుంజుకుందని అంటున్నారు.
Nagpur: భార్యపై అనుమానం..సుత్తితో కొట్టి చంపిన భర్త