ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లో మీ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. మీ సలహాలు, సూచనల పాటించాం….గెలిచామని, సఖ్యతగా పనిచేస్తే గెలిచె అవకాశం ఉన్నదని మీరు చెప్పారు, మేం కలిసి గెలిచామన్నారు. ఏమైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఖచ్చితంగా అమలు చేస్తామని, తెల్లకాగితలను నల్లగా మార్చే జి ఓ లు కాకుండా అమలు చేసే దిశగా అడుగులు వేశామన్నారు. 48 గంటల్లోనే రెండు హామీలు అమలు చేసామని, ప్రధాన ప్రతిపక్షం తీరు ఎలా ఉందో మీరే చూస్తున్నారన్నారు. ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్బాలు పలుకుతూనే అప్పుల కుప్పగా మార్చారని, ఎదో చిన్న చిన్న అప్పులు సహజం అనుకున్నాం… ఛార్జ్ తీసుకున్నాక తెలిసింది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేత పత్రం విడుదల ద్వారా రాష్ట్ర ఆర్ధిక స్థితి ప్రజలకు తెలియ జేశామని, గడచిన 9న్నర ఏళ్లలో 6 లక్షల కోట్ల పైన అప్పులు చేసారన్నారు. చేసిన అప్పులకు పెంచిన సంపదకు సంబంధమే లేదని, అప్పులు చేసి ఓ మంచి ప్యాలెస్ కట్టారన్నారు. సచివాలయం ఎంతో అద్భుతంగా ఉంది…చార్మినార్ లాగా ఉందని, పేదల బాధలు పట్టించుకోకుండా అప్పులు చేసి మరీ భవనాలు కట్టారన్నారు.
అంతేకాకుండా.. ‘నేను,నా, నాది తప్ప మరేమీ లేదు…. ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం కాదని కొత్తది కట్టారు.. కాళేశ్వరం స్థితి చూస్తే తెలంగాణ ప్రజలు విస్తూ పోయే నిజాలు దాగున్నాయి…. మొక్కుబడిగా నిర్మించారు…. కాళేశ్వరం కు భవిష్యత్ ఉన్నట్లు కనిపించడం లేదు…. పంపు హౌస్ ఎందుకు మునిగింది…అంత దిగువున ఎలా కట్టారని ప్రశ్నిస్తే సమాధానం లేదు…. ప్రజల సంపదను ఇలా వృధా చేశారు…. ఇన్ని చేసి కూడా అసెంబ్లీ లో పోట్ల గిత్తల్లా గొడవకు దిగారు…. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం చికేలోకి వెళ్లేలా ప్లాన్ చేశారు…. అయినా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూర్చోబెట్టి ఒక్క నిమిషమ్ కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకున్నారు…. ఇదే ఆర్ధిక శాఖను,ఇరిగేషన్ శాఖను వెలగబెట్టిన హరీష్ అవాకులు చెవాకులు పేలారు… కేసీఆర్ పాలన ముందు మెరుపులు వెనక డొల్లతనం…. పేదవాడి గుమ్మాన్ని ప్రతి పధకం ముద్దాడాలి….అదే మా లక్ష్యం….
గిరిజన,ఆదివాసీ,చెంచు గూడేలకు పథకాలు వెళ్ళాలి…. నూటికి నూరు శాతం 6 పధకాలు అమలు చేస్తాం…. మీడియా మిత్రుల సమస్యలు పరిష్కరిస్తాం…. రాష్ట్రం లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు న్యాయం చేస్తాం…. పాలకులం కాదు సేవకులం…. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అయినా ముందుకెళతాము..’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.