NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం

Ponguleti

Ponguleti

ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడు పేట గ్రామంలో సియం ఆర్ యప్ చెక్కులను మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. నిత్యము ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, ప్రజల ఆశిస్సుల మేరకు ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలను జోడెద్దుల్లాగా నడిపిస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు చేస్తున్నాయని, తొమ్మిదిన్నార ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వారు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఏడు నెలల ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పదవిబోయిన ఏడు నెలలకే అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ప్రభుత్వాన్ని దించుతాము అంటున్నారన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే వారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు కాబట్టే వారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఇందిరమ్మ రాజ్యమైతే ఎంతో చల్లగా ఉంటదని ప్రజలు గమనించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఎన్నుకున్నారన్నారు. సకాలంలో వానలు పడటంతోటి సాగర్, ఇతర ప్రాజెక్టులు నిండి సమృద్ధిగా రెండు పంటల పండే వర్షాలు కురుస్తున్నాయన్నారు.

అంతేకాకుండా..’ సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో బిఅర్ఎస్ పార్టీ గొప్పలకు పోయి పేదోడి సొమ్మును దుర్వినియోగం చేశారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక వీలైనంత పొదుపు చేస్తూ సీతారామ ప్రాజెక్ట్ ను గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం అవకుండ పూర్తి చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆనాటి బిఅర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ కోసం 8 వేల కోట్లు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 550 కోట్లు పాత పెమెంట్ లు చేశాం..నిద్రపోతున్న కాంట్రాక్టర్లను మేల్కొల్పాం. 1 లక్షా 75 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు 93 కోట్లు ఖర్చు పెట్టీ 9.6 కిలోమీటర్లు ఎన్కూర్ వద్ద లింక్ కెనాల్ ఏర్పాటు చేశాం. ప్రజల సొమ్ము నిరుపయోగంగా ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక యుద్ధప్రాతిపదికన కెనాల్ ను పూర్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పదవి నుండి దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 7 లక్షల 19 వేల కోట్లు. ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6 వేల కోట్లు మిద్ది వివిధ బ్యాంక్ లకు చెల్లిస్తుంది. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా చిత్తశుద్ధితో 31 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. 31 వేల కోట్లు రైతులకు రుణం చేసే పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వానికి లేదు. నిబద్ధతతో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తుంది. ‘ అని పొంగుటే వ్యాఖ్యానించారు.