తెలంగాణలో భారీగా వచ్చిన వరదలు వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయామని అయితే తమను ఆదుకోవాలని కనీసం 2000 కోట్ల రూపాయలైనా సరే ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటివరకు స్పందించ లేదని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు .తెలంగాణలో జరిగిన నష్టం అంచనా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా వివరించామని అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి హామీ లభించలేదని పొంగులేటి అంటున్నారు. ఖమ్మం పర్యటనలో టిఆర్ఎస్ నేతలకి ప్రజల నుంచే తిరస్కారం వచ్చిందని దాన్నుంచి తప్పించుకునేందుకు కోసం కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు కురిపిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. టిఆర్ఎస్ నేతలు మాజీమంత్రి చేసిన కబ్జాల గురించి హరీష్ రావుకి ఆయన వెంట వచ్చిన నేతలకి మాట్లాడే ధైర్యం లేదని అన్నారు. వరదలు వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇండ్లకి నష్టపరిహారం ఇచ్చి రైతులని ప్రజలని ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Minister Nara Lokesh: బుడమేరు గండి పూడ్చే పనులు.. సీఎంకు వివరించిన మంత్రి లోకేష్