Ponguleti Srinivas Reddy : సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతుందని, హడావుడి లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుందన్నారు. కోటి 16 లక్షల 14 వేల 349 కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నట్లు, 9వ తేదీ నుంచి సర్వే జరిగుతోందని, ఇప్పటివరకు 58.3% అంటే 67 లక్షల 76 వేల 203 కుటుంబాల సర్వే జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. ఏ కుటుంబానికి ఏమి అవసరం? ఏ గ్రామానికి ఎం అవసరం అనేది సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ములుగు జిల్లా, నల్గొండ, జనగామ జిల్లాల్లో అధిక శాతం సర్వే పూర్తి అయ్యిందని, హైదరాబాద్ లో 37 శాతం సర్వే జరిగిందన్నారు. చేసిన సర్వేను ఫార్మేట్ ప్రకారం కంప్యూటరికరణ జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈనెల 30తో సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని, సరైన మార్గంలో సర్వే జరుగుతుందన్నారు.
Jio 5G: అదిరిపోయే ఆఫర్.. రూ.601తో ఏడాదంతా అన్‌లిమిటెడ్ డేటా
అంతేకాకుండా..’ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. సర్వే అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రాకుండా పోతాయని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు ఆగిపోవు. అర్హులైన వారికి పథకాలు తప్పకుండా వస్తాయి. సర్వేలో ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకోండి. ప్రతిపక్షాలు చెప్పేవన్ని నమ్మొద్దని ప్రభుత్వ విజ్ఞప్తి. రాజకీయ లబ్ది కోసమే సర్వే పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో మీరు చేసిన సర్వేని పేద ప్రజలకు మంచి చేసే పనులు ఏమైనా చేశారా? సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు. ఆ సర్వే వివరాలు ఇప్పటికీ మాకే తెలియదు. సర్వే ద్వారా ప్రజల ఆస్తులను తెలుసుకుని మీ ఆస్తులుగా ట్రాన్స్ ఫర్ చేసుకుని మీ ఆస్తులు పెంచుకోవడానికి మీకు సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడింది. మీరు గత సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? మీ బావ భామర్ధి కుటుంబాలు కూడా సర్వేలో పాలు పంచుకోవాలి. ఎమ్మెల్సీ కవిత సర్వేలో పాల్గొన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున అభినందనలు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)