ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమల పాలెం మండలం పైనంపల్లి గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు పాలేరులో రాబోయేది కురుక్షేత్ర యుద్ధం అని ఆయన అభివర్ణించారు. రేపు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపడం ఖాయమన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. నేను కూడా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయటం ఖాయమన్నారు పొంగులేటి. పాలేరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎవ్వరికీ రాని మెజార్టీ తో నన్ను గెలిపించాలని కోరారు పొంగులేటి.
Also Read : Ashu: రేంజ్ రోవర్ కొన్న అషు రెడ్డి.. భలే హ్యాపీగా ఉందంటున్న వేణుస్వామి
‘పాలేరు సభలో సీఎం కేసీఆర్ అనేక అవాకులు, చవాకులు పేలారు. నా పేరు ప్రస్తావించకుండా నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ప్రజాస్వామ్యం, నోట్ల కట్టల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడటం విడ్డురంగా ఉంది. మీ పక్కన కూర్చున్నోళ్లు ఏ పార్టీ నుండి గెలిచారు.. ఎంత ప్యాకేజీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలు నవ్వు కునేలా చేసింది ఎవరు?. ప్రజాస్వామ్యం అనే పదం వాడే హక్కు మీకు ఉందా?. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, జాతీయ రాజకీయలలో డబ్బు మదంతో అహాంకారంతో మాట్లాడేది ఎవరు?. కాంట్రాక్ట్ లు చేసి, పైరవీలు చేసి నేను డబ్బు సంపాదించానని మాట్లాడారు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తడి బట్టలతో వస్తాను.. ఏ గుడికి ఎప్పుడు వస్తారో రండి నేను కూడా వస్తాను.’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.