NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : అధికారులు ఎక్కువ చేస్తే బదిలీలు ఉండవు.. డైరెక్ట్‌గా రిమూవ్ చేయడమే

Ponguleti

Ponguleti

రేషన్ కార్డ్ ఏ కాదు ఏదైనా అనర్హులైన వారు వారి అంతట వారే తప్పుకుంటే మంచిదన్నారు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ధనుకులకి కాదు బీదవారి ప్రభుత్వమని, ప్రజలకి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎవరైనా అధికారులు ఎక్కువ చేస్తే నా పాలనలో ట్రాన్స్ఫర్లు ఉండవు డైరెక్ట్గా రిమూవ్ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకి ఎంత బాధ ఉంటే మీ మీద కంప్లైంట్ చేస్తారు అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని ఆయన అన్నారు.

ప్రజాసమస్యలు పట్టించుకోలేని వారిని ప్రభుత్వ ఉపేక్షించబోదని హెచ్చరించారు. అధికారులంతా సక్రమంగా పనిచేయాలని, కబ్జాకు గురైన వాటన్నిటిని బయటకు తీసి పేదోడికి అప్పజెప్పాలని ఆయన సూచించారు. ఇకనైనా ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని పొంగులేటి తెలిపారు. మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం.. త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రూ.31వేల కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేయనున్నామని పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు.