NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ రాజ్యం వచ్చాక రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాం

Ponguleti

Ponguleti

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు అధికారం లో ఉన్న పార్టీ అనేక మాయమాటలు చెప్పిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా దళిత బంద్,బిసి బంద్ అంటూ మాటలు చెప్పారని, ఎన్నికల షెడ్యూల్ వచ్చే విషయం తెలిసే దళితులకు దళిత బంద్ ఇస్తామని చెప్పారన్నారు పొంగులేటి. నిరుపేదలకు అనేక తైలాలు చూపించారని, ఏ ఒక్క పని చేయలేదు..ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెపుతున్నారన్నారు.

అంతేకాకుండా.. ‘5 సంవత్సరాల నుండి ఏం గడ్డి పీకారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారు. కాంట్రాక్టర్ల దగ్గర,సింగరేణి దగ్గర డబ్బు ఎలా గుంజుకోవలో అనే పనిలో ఉంటారు. డిసెంబర్ 9 న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లో రాబోతుంది. సత్తుపల్లి లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక 6 గ్యారెంటీ హామీలు అమలవుతాయి. అనాడు ఇచ్చిన విధంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా కావల్సినన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఆడబిడ్డలకు 500 కే గ్యాస్,ప్రతి నెల ఖర్చులకు 2500 ఇస్తాం. ఆసరా పెన్షన్ 4 వేలు ఇస్తాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతు బంధు 17 వేలు ఇస్తాం.రైతు కూలీలకు ప్రతి సంవత్సరం 12 ఇవ్వటం జరుగుతుంది. అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరం లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.10 లక్షలు వైద్యానికి ప్రతి వ్యక్తికీ ఇస్తాం. రైతులకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,కార్పొరేట్ స్కూల్ లో ఉచిత విద్య ను అందిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తో ప్రయాణించాలి అని సోనియాగాంధీ అడిగారు..

తెలంగాణ రాష్ట్రం లో ఇందిరమ్మ రాజ్యం ను తేవాలి. 50 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సత్తుపల్లి జిల్లా చేయాలని స్థానికులు అనేక కార్యక్రమాలు చేశారు. బీఅర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సత్తుపల్లి నీ జిల్లా చేయాలని అడిగాను.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక సత్తుపల్లి నీ జిల్లా చేస్తాం. నియోజక వర్గం లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. బొగ్గు గనుల వల్ల స్థానిక ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సింగరేణి లో ఉద్యోగాలు అన్ని స్థానికులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సింగరేణి వల్ల ఇళ్లు నష్టపోయిన వారికి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక సింగరేణి ద్వారానే ఇళ్ళు నిర్మించేలా చూస్తాం. అధికార మధం తో ఓ mlc ఊగి పోతున్నాడు. అధికార పార్టీ ప్రజలను తప్ప సామాన్య ప్రజలను బ్రతకనివ్వకుడాడదని వారి మాటల ద్వారా అర్ధం అవుతోంది. అధికార మథం తో ఉన్న నాయకులకు బుద్ధి చెప్పాలి..కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తిస్కురావలి. గొర్రెలు స్కీం ఇస్తామని మాయమాటలు చెప్పి యాదవ సోదరుల నుండి డబ్బులు కట్టించుకున్నారు..ఇప్పటికీ గొర్రెలు పంపిణీ చేయలేదు. అన్ని కులాలను,మతాలను మయం చేయటం లోనే బిఅర్ఎస్ ప్రభుత్వం ఎటువంటిదో అర్థం అవుతుంది’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు.