AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా ఎన్నికల అధికారులు సైతం తగిన ఏర్పాట్లు చేశారు.
Read Also: Ram Charan : తండ్రి బాటలోనే తనయుడు.. దైవభక్తి కూడా ఎక్కువే..
ఇక, సమస్యాత్మక.. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ దగ్గర ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని అరకు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం ఐదు గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరగనున్నట్లు ఈసీ పేర్కొనింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠమైన భద్రతను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
Read Also: General Elections 2024 Live Updates : సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్
ఇక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,10,58,615 మంది మహిళలు ఉండగా.. 2,03,39,851 మంది పురుషులు ఉన్నారు. అలాగే, 3,421 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. రాష్ట్రంలోని 156 అసెంబ్లీ స్థానాల పరిధిలో పురుషుల కన్నా మహిళ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ప్రజలు ఓట్లేసేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా 46, 389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పోలింగ్ కోసం లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,20,566 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఇక, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఈసీ పేర్కొనింది.
