Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

Elections

Elections

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది.

Read Also: Woman Died: ఉప్పల్‌లో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లి మహిళ మృతి!

×
×
Ad

ఏపీలో కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఈ సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.