Site icon NTV Telugu

Karnataka Minister: రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదు.. వ్యవస్థ వారిని అలా చేస్తుంది..

Karnataka Minister

Karnataka Minister

Karnataka Minister: నేటి కాలంలో అవినీతి రహిత జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పని అని… ఎందుకంటే రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడాలని డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదని, ప్రజలు, వ్యవస్థ వారిని అలా చేస్తాయని ఆయన అన్నారు. శనివారం శివకుమార శివాచార్య స్వామివారి వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. “రాజకీయ నాయకులను అవినీతిపరులు అని పిలవను, ప్రజలే వారిని తయారు చేశారు, ఓట్లు వేయడం మొదలు గణేష్ ఉత్సవాల వరకు వివిధ కార్యక్రమాల పేరుతో రాజకీయ నాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడకుండా ఎలా ఉంటారు.” అని మంత్రి అన్నారు.

Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ

ప్రజలు ప్రతిదానికీ డబ్బు తీసుకుంటారని గతంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగాన్ని కూడా పలువురు అడ్డుకున్నారు. వాతావరణమే రాజకీయ నాయకులను అవినీతిపరులుగా మారుస్తుందన్న ఓ దర్శకుడి మాటతో తాను ఏకీభవిస్తున్నానని జేసీ మధుస్వామి అన్నారు. “వ్యవస్థ మనల్ని చెడగొడుతోంది, అది మనల్ని పాడు చేయకపోతే, మనం అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులందరికీ తమకు కావాల్సినంత డబ్బు ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బు ఎక్కడ సంపాదించాలి అనే ఆలోచనలు రావడం సహజం. అలాంటి పరిస్థితి తలెత్తకపోతే అప్పుడు వ్యవస్థ చెడిపోదు. అవినీతికి మూలం ఆలోచన. ఒత్తిడే అవినీతికి కారణం కావచ్చు. అవినీతి లేకుండా జీవించగలను అని చెప్పడం అంత తేలిక కాదు.”అని ఆయన అన్నారు.

Exit mobile version