NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: వారసత్వ పన్ను అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం..

Tax 10

Tax 10

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస్తిలో సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. “కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో ఆర్థిక, కులాల సర్వే నిర్వహించాలని చెప్పారని చెప్పాం. ఈ సర్వే ద్వారా అందిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపింది. ఇదిలా ఉండాగా.. ఆర్థికవేత్త గౌతమ్ సేన్, వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. సంపద పంపిణీ పథకం భారతదేశంలో పనిచేయదన్నారు. దాదాపు 12 కోట్ల మందికి మాత్రమే రూ.102 కోట్లకు పైగా ఆస్తులున్నాయని తెలిపారు. అయితే దాదాపు అందరూ తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అదే సమయంలో, ఆస్తి పంపిణీ కారణంగా, దేశంలోని 98 నుండి 99 శాతం ప్రజల జీవితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని స్పష్టం చేశారు.

READ MORE: Weather Report : ఏప్రిల్ నెలలో 19వ శతాబ్దపు రికార్డులను బద్దలు కొట్టిన ఉష్ణోగ్రతలు

కాగా.. లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌కు ముందు ఆస్తి పంపిణీపై రాజకీయ గందరగోళం నెలకొంది. వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం లేపింది. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టగా, శామ్ పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆయన ఏమన్నారంటే.. “అమెరికాలో, వారసత్వపు పన్ను చట్టం ఉంది. ఎవరైనా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే బదిలీ అవుతాయి. ప్రభుత్వం మిగిలిన 55% తీసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టం. మీరు సంపదను సృష్టించారు, మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం, ఇది సముచితమని భావిస్తున్నా. దానిని పేదలకు పంచుతాం.” అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.