సికింద్రాబాద్లో గంజాయి కలకలం రేపుతోంది. 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేశారు. ఒరిస్సా నుండి సికింద్రాబాద్ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో టాస్క్‌ఫోర్స్ టీమ్ మాటు వేసి పట్టుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ నుండి ఒరిస్సా వెళ్లి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు కేటుగాడు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా కొనుగోలు చేసిన గంజాయితో ఒరిస్సా నుండి సికింద్రాబాద్ చేరుకుంటున్నాడు. యూపీ నుండి తన స్నేహితుడిని పిలిపించి గంజాయి అప్పగిస్తున్నాడు. తను కాకుండా తన స్నేహితుడితో గంజాయి స్మగ్లింగ్ చేయిస్తున్నాడు. ఈ గ్యాంగ్ యూపీలో గంజాయి విక్రయిస్తుంది. అయితే.. సికింద్రాబాద్‌లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఈ గ్యాంగ్ ఆట కట్టించింది. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా
ఇదిలా ఉంటే.. ఐదురోజుల క్రితం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. కారులో దాదాపు 10 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అనంతరం పట్టుబడిన గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఇద్దరు హైదరాబాద్ లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి గంజాయి అక్రమరవాణా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Buchibabu: బుచ్చిబాబుతో కేక్ కట్ చేయించిన RC16 నిర్మాత!