Site icon NTV Telugu

IND vs AUS Final: పోలీసుల గుప్పిట్లోకి అహ్మదాబాద్ సిటీ

Ahmedabad

Ahmedabad

ప్రస్తుతం ప్రతి ఒక్కరి కోరిక టీమిండియా వరల్డ్ కప్ గెలవడమే.. అయితే, ఇప్పటికే భారత జట్టు అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. దీంతో రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో భారత్‌ తలపడబోతుంది. ఇక, ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.

Read Also: Miss Universe 2023: మిస్ యూనివర్స్ పోటీలు.. నేషనల్ కాస్ట్యూమ్స్ డేలో ఆకట్టుకున్న శ్వేతా శార్దా

అయితే, అహ్మదాబాద్ నగరాన్ని పోలీసుల గుప్పిట్లోకి తీసుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా సిటీ వ్యాప్తంగా గట్టి బందోబస్తు చేశారు. ఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులుగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తో పాటు పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు వస్తుండటంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత సమావేశం నిర్వహించారు. అహ్మదాబాద్ లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం చేశారు. ఇక, స్టేడియం పరిసరాల్లో 4,500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

Read Also: Jagapathi Babu : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జగ్గు భాయ్ ..?

ఇక, అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కి అగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో.. స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్ లు జరుగుతాయని పోలీసులకు అగంతకుల కాల్స్ వచ్చాయి.. ముంబై వేదికగా జరిగిన ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.. ఇందులో భాగంగానే అహ్మదాబాద్ స్టేడియం పరిసరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను సైతం పెంచారు.

Exit mobile version