Site icon NTV Telugu

HYD : TSPSC ఆఫీస్ లో పోలీసుల సీన్ రీ కన్ స్ట్రక్షన్.. వెలుగులోకి కీలక విషయాలు

Paper Leak

Paper Leak

TSPSC లో పేపర్ లీక్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో TSPSC ఆఫీస్ లో పోలీసుల సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి నేరం జరిగిన తీరును పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి కంప్యూటర్ ను నిందితుల సమక్షంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రస్ లు మార్చి కంప్యూటర్ లోకి ఎలా చొరబడ్డారనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఐపీ అడ్రస్ ఎలా మార్చారని విషయాన్ని పోలీసులకు నిందితుడు రాజశేఖర్ రెడ్డి చూపిస్తున్నారు.

Also Read : S Jaishankar: హిమాలయాల్లో ఇండియా-చైనాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ లాగిన్ పాస్వర్డ్ లను శంకర్ లక్ష్మి డైరీలో నుంచి దొంగిలించినట్లు పోలీసులకు ప్రవీణ్ చెప్పాడు. డైరీలో ఎక్కడ కూడా లాగిన్ పాస్వర్డ్ రాయలేదని పోలీసులకు శంకర్ లక్ష్మి చెప్పారు. దీంతో రాజశేఖనరక్ రెడ్డి ఐపీ అడ్రస్ లను మార్చి కంప్యూటర్ లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 27వ తేదీన ఏఈ పరీక్ష పేపర్ తో పాటు టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలను కాపీ చేసినట్లు పోలీసులకు నిందితుడు ప్రవీణ్ చెప్పాడు. ప్రవీణ్ అబద్ధాలు చెప్పినట్లు ప్రాథమికంగా తేల్చిన సిట్ అధికారులు అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్ష ప్రశ్నాపత్రాలను కూడా లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి.. ఫిబ్రవరి 27వ తేదీ కంటే ముందు నుంచే లీకేజీ వ్యవహారం నడిపించినట్లు పోలీసులు తేల్చారు.

Also Read : Janagama : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడు

Exit mobile version