NTV Telugu Site icon

Kadapa: కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు.. జిల్లా నుంచి రౌడీషీటర్లు బహిష్కరణ..!

Kadapa

Kadapa

కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందు కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసులు జారీ చేశారు. ఇక, రౌడీ షీటర్స్ ను జిల్లా వదిలి వెళ్ళిపోవాలని నోటీసులు ఇచ్చింది. కడప జిల్లా వ్యాప్తంగా 40 మంది రౌడీ షీటర్లు జిల్లా నుంచి బహిష్కరణ చేస్తున్నట్లు వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గంలో 52 మంది.. కడప నియోజకవర్గంలో 22 మందితో పాటు 6 మంది రౌడీ షీటర్స్ జిల్లా బహిష్కరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Gangs of Godavari Twitter Review: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?

అలాగే, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్స్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా రౌడీ షీటర్లను సస్పెక్టెడ్ షీట్ ఉన్న వారిని జిల్లా బహిష్కరణకు రంగం సిద్ధం చేశారు. జూన్ నెల 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా బహిష్కరణకు నోటీసులు జారీ చేశారు. ట్రబుల్ మంగర్స్ కు ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజనల్ కోర్టు నుంచి నోటీసుల జారీకి పోలీసులు శ్రీకారం చుట్టారు. నేడు రెవెన్యూ డివిజనల్ మ్యెజిస్ట్రేట్ వద్ద హాజరు కావాలంటూ గృహ నిర్బంధంలో ఉండనున్న వారికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మొత్తం 38 మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల రోజు ఘర్షణ జరిగిన వారిపై ప్రత్యేక దృష్టి ఉంచిన పోలీసులు.. జమ్మలమడుగులో 6 మంది రౌడీషీటర్లను నియోజకవర్గం వదిలి వెళ్లాలని నోటీసులో పేర్కొన్నారు. మరో 32 మందిని గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. రూల్స్ అతిక్రమించి ఇంటి నుంచి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.