NTV Telugu Site icon

Ganja: గంజాయి మత్తులో ఊగిపోతున్న యువత.. పోలీసుల అదుపులో యువకులు..

Ganja

Ganja

ఈ మధ్య కాలంలో గంజాయి క్రయవిక్రయాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో పోలీసులు గంజాయి సేవిస్తున్న వారితో పాటు అమ్మకాలు చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు. అయినా కూడా ఈ గంజాయి అమ్మకం మాత్రం ఆగడం లేదు.. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ, యువత గంజాయికి బాగా అలవాటు పడుతున్నారు. తాజాగా, హనుమకొండ జిల్లాలోని డబ్బాలు, కుమారపెల్లి మార్కెట్ కేంద్రంగా చేసుకొని యువత గంజాయి సేవిస్తున్నారు అని సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్థ రాత్రి వేళలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి అనే మత్తు పదార్థానికి అలవాటు పడి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయిని అరికట్టడానికి రాత్రి వేళలో సిబ్బందితో కలిసి గంజాయి అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం అని పోలీసులు వెల్లడించారు.

Read Also: DC vs KKR: ఇషాంత్ శర్మ సూపర్‌ యార్కర్‌.. కిందపడిపోయి క్లీన్‌బౌల్డ్ అయిన రస్సెల్!

ప్రజలు ఎక్కడైనా ఇలాంటి గంజాయి ముఠా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని కోరారు. గంజాయి అనేది చైన్ సిస్టంగా మారింది.. దీన్ని పూర్తిగా నిర్మించాలని చూస్తున్నాం.. కొంత మంది అనుమానాస్పద యువకులను అదుపులోకి తీసుకున్నాము.. వారిని ఇంట్రాగేట్ అయితే చేస్తున్నాం.. అదుపులోకి తీసుకున్న వారి నుంచి గంజాయి సప్లై చేసే వారి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని హన్మకొండ టాస్క్ పోర్స్ పోలీసులు చెప్పుకొచ్చారు.