Site icon NTV Telugu

Police Raids: యువకుల గంజాయి పార్టీపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

Police Raids

Police Raids

Police Raids: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలో యువకుల గంజాయి పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఓ గదిలో మూకుమ్మడిగా కొందరు యువకులు గంజాయి సేవిస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 17 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Pragathi: ఆ రకంగా చూస్తూ.. ఆంటీ అంటే నేను కూడా ఊరుకోను

స్థానిక యువకులు కొందరు సాయిబాబా గుడి సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని.. చీకటి పనులకు పాల్పడుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడిలో మూడు కేజీల గంజాయితో పాటు విస్తు పోయే కొన్ని విషయాలు బయటపడ్డాయి. అదుపులోకి తీసుకున్న యువకుల సెల్ ఫోన్లలో స్థానికంగా ఉండే వారిని అభ్యంతరకర రీతిలో తీసిన ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాడిలో పట్టుబడిన వారిలో కొందరు గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన కేసులో విచారణకు హైదరాబాదు వెళ్లి వస్తూ కొనుగోలు చేసుకుని వచ్చిన గంజాయితో పార్టీ చేసుకుంటుండగా పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది

Exit mobile version