Site icon NTV Telugu

Sunil Kanugolu : రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల రైడ్

Sunil

Sunil

రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు రైడ్ చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్ కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్‌లను పోలీసులు సీజ్ చేశారు. అయితే.. సీఎం కేసిఆర్ కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కార్యాలయంలోని సిబ్బంది సెల్ ఫోన్ లు ఆఫ్ చేయించారు పోలీసులు. అయితే.. గత కొంత కాలంగా కాంగ్రెస్ కోసం పని చేస్తోంది ఎస్ కే టీమ్.. అయితే.. పోలీసుల చర్యలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి.. ఎలాంటి ఎఫ్ఆర్ఐ లేకుండా ఎలా కార్యాలయాన్ని తనిఖీ చేస్తారని కాంగ్రెస్‌ నేతలు నిలదీశారు. దీంతో.. కాంగ్రెస్‌ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. సునీల్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం కార్యాలయంపైన పోలీసుల దాడి, సీజ్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఫేస్‌బుక్‌తో పాటు పలు సోషల్ మీడియాలో మీమ్స్ తయారుచేసి పెడుతున్నారని, ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ పైన మీమ్స్ తయారు చేసి పెడుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు.

Also Read : Nuclear Fusion Breakthrough: కేంద్రక సంలీన చర్యలో కీలక ముందడుగు..శాస్త్రవేత్తల ప్రకటన
గత కొన్ని రోజుల నుంచి ఐపీ అడ్రస్ ఆధారంగా కార్యాలయాన్ని ట్రాక్ చేస్తున్న పోలీసులు.. కొద్ది సేపటి క్రితం ఇనార్బిట్ మాల్ పక్కనే ఉన్న ఆఫీస్ కార్యాలయాన్ని గుర్తించారు. అయితే.. సునీల్ కార్యాలయంపై ఏకకాలంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేశారు. అయితే.. కార్యాలయంలోకి పోలీసులు వచ్చిన విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ అగ్ర నాయకులు అక్కడకు చేరుకున్నారు. సునీల్ కార్యాలయంలో పోలీసుల వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు.. అయితే.. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయం పై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయని, ఇక్కడ పోలీసుల పెత్తనం ఏంటని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకొమని, ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.

Exit mobile version