Tirupati Canal death: కాలువలో దూకిన యువకుడి డెడ్ బాడీ లభ్యం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట ఈ కోడిపందాల సందడి కనిపిస్తూనే వుంది. తిరుపతిలో కోడిపందేల రాయుళ్లు రెచ్చిపోతున్నారు. తిరుపతి జిల్లాలో పోలీసుల దాడులకు భయపడి పందెంరాయుళ్ళు కాలువలో దూకడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కోడి పందెం రాయుళ్ల తీరుపట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద మామిడి తోపులో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారంతో రైడ్ చేశారు పోలీసులు.
Read Also: Balanagamma Movie: ఎనభై ఏళ్ళ జెమినీ వారి ‘బాలనాగమ్మ’
అయితే పోలీసులు దాడి చేస్తారనే సమాచారం అందుకున్న పందెం రాయుళ్ళు పారిపోయారు. కోడిపందేలు ఆడుతున్న సమయంలో పోలీసులు రావడంతో కాలువలోకి దూకిన యువకుడు మనోహర్ మృతదేహం లభ్యం అయింది. దీంతో విషాదం నెలకొంది. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో కాలువలో దూకారు నలుగురు యువకులు. కాలువలో నుండి ఈదుకుంటూ బయటకు వచ్చారు ముగ్గురు యువకులు. అయితే, కాలువలో దూకిన వారిలో మనోహర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన వారు బయటకు వచ్చి నాలుగో వ్యక్తి గురించి వాకబు చేశారు. గల్లంతైన యువకుడు కోసం గాలించారు. చివరకు అతడి డెడ్ బాడీ లభ్యం అయింది. కోడిపందాల సరదా ఆ యువకుడి ప్రాణం తీసింది. సినిమా టిక్ గా కాలువలో దూకడం, ఒకరు గల్లంతు కావడం, అతడి మరణించడంతో విషాదం నెలకొంది.
Read Also: Govinda Namalu Bhakthi Tv Live: గోవింద నామాలు వింటే…