Site icon NTV Telugu

YS Jagan Helicopter Incident: హెలికాప్టర్ వివాదం.. కో పైలట్‌పై 100 ప్రశ్నల వర్షం..!

Jagan Helicopter Incident

Jagan Helicopter Incident

YS Jagan Helicopter Incident: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటనలో హెలికాప్టర్ వివాదంలో ఏపీ పోలీసులు చాలా సీరియస్‌గా ముందుకెళ్తున్నారు. జగన్.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జనం పెద్దఎత్తున దూసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బతింది. దీంతో వీఐపీని అందులో తీసుకెళ్లలేమని పైలట్లు చెప్పారు. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు. అయితే, ఇందులో నిజానిజాలెంత అనే దానిపై విచారణ చేపట్టారు. ఈ అంశంపై విచారణకు రావాలని పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ కు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసుల మేరకు ఇవాళ చెన్నేకొత్తపల్లి పోలీసుల ఎదుట కోపైలట్ శ్రేయస్ జైన్ హాజరయ్యారు. కో పైలట్ ని డీఎస్పీ , సీఐలు సుదీర్ఘంగా విచారించారు. సుమారు 3 గంటల పాటు.. 100 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. కుట్ర కోణం గురించి లోతుగా ఆరాతీశారు. టూవే బుకింగ్ చేసుకున్న సమయంలో హెలికాప్టర్ కు అర్ధాంతరంగా ఎందుకు ఫ్లై చేశారన్న యాంగిల్‌లో ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే మెయిన్ పైలట్ ను విచారణకు పిలిచే యోచనలో ఉన్నట్టు సమాచారం. రేపు పైలట్ అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Kushboo : వాళ్లు అసహ్యంగా ఉంటారు.. ఖుష్బూ ఫైర్..

పైలట్ అనిల్ కుమార్ తో పాటు థర్డ్ పార్టీ టికెటింగ్ ఏజెన్సీ చిప్పన్ ఏవియేషన్ కంపెనీ కి కూడా నోటీసులు ఇస్తారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రజల వల్ల హెలికాప్టర్ దెబ్బతిందా? లేకపోతే ఇక వేరే కారణమని ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీసినట్టు సమాచారం. చాపర్ అర్ధాంతరంగా వెనక్కి వెళ్లడంపై కో పైలట్ చెప్పిన అంశాలను రికార్డ్ చేశారు. ఏ నిబంధన ప్రకారం అలా వెళ్లాల్సి వచ్చిందో వివరణ కోరారు. MEL లిస్ట్ ప్రకారం వెళ్లినట్లు పోలీసులకు సమాధానం ఇచ్చిన కో పైలట్.. ప్యాసింజర్ సైడ్ విండో క్రాక్ ఇవ్వడంపై కూడా వివరాలు తెలుసుకున్నారు. విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. అయితే ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందన్నది చూడాలి.. మరోవైపు.. దీనిపై రాజకీయ ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి..

Exit mobile version