Police Attacked Women: దారుణం.. మహిళలపై కర్రలు, లాఠీలతో దాడిచేసిన పోలీసులు

Whatsapp Image 2022 11 07 At 1.42.03 Pm

Whatsapp Image 2022 11 07 At 1.42.03 Pm

Police Attacked Women: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మహిళలని చూడకుండా పోలీసులు వారిపై కర్రలు, లాఠీలతో దాడిచేశారు. ఇప్పుడు ఇదే విషయం విమర్శలకు దారితీస్తోంది. పోలీసుల తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అంబేద్కర్‌నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో ఈ మధ్య బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతం తమదంటూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంపై అప్పటినుంచి వివాదం కొనసాగుతోంది.

Read Also: Kalyan Ram: ఆసక్తి రేపుతున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్

ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. ఆందోళణకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీలు, పైపులు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడంతోనే వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలియజేశారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.