Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ జనసేన నేతలు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేశారు.
Read Also: LK Advani: ఎల్‌కే అద్వానీ హెల్త్ బులెటిన్ విడుదల..