NTV Telugu Site icon

Cyber ​​crime: అలర్ట్.. పాడైన ఫోన్లు అమ్ముతున్నారా.. చిక్కుల్లో పడ్డట్లే!

Old Mobiles

Old Mobiles

పాత మొబైల్ ఫోన్లు కొంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైమ్ ల కోసం పాత ఫోన్లను వాడుతున్నారని పోలీసులు గుర్తించారు. వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్ ఇచ్చి ఫోన్లు కొంటున్నారు. 3 గోనే సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికర్ ని గోదావరి ఖని పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా పట్టుకున్నారు. ఈ ముఠా తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాన మొబైల్ ఫోన్లు కొని బీహార్ మీదుగా… జామ్ తారా, దేవ్ ఘర్, జార్ఖండ్ తరలిస్తోంది. సైబర్ నేరగాళ్లకు అమ్మేముందు.. మొబైల్ ఫోన్స్ లో సాప్ట్ వేర్ మార్చడం, ఇతర విడిభాగాలు మార్చి.. ఫోన్ పనిచేసేలా చేస్తున్నారు. అనంతరం అందులో ఉన్న డేటాను సైబర్ నేరగాళ్ల చేతికి అందజేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు మీ పాత ఫోన్లను అమ్మవద్ధని పోలీసుల సూచిస్తున్నారు.

READ MORE: Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్ల ప్రయోగం.. ఒకరి మృతి.. ఇళ్లు ధ్వంసం

కాగా.. రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. దీంతో పోలీసులు ఇతర నేరాలను ఎంక్వైరీ చేసినంత ఈజీగా సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ను పసిగట్టలేకపోతున్నారు. ఓటీపీలను షేర్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని, లింక్‌‌‌‌‌‌‌‌లు ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని, సీవీఆర్‌‌‌‌‌‌‌‌ నంబర్లు ఎవరికీ చెప్పొద్దని ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. కానీ నేరాలకు పాల్పడుతున్న వారు మాత్రం తెలివిగా సొమ్ము కాజేస్తున్నారు. కొత్తగా మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్లను హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ గూగుల్‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌ పే యాప్స్‌‌‌‌‌‌‌‌కు లింక్‌‌‌‌‌‌‌‌ అయిన క్రెడిట్‌‌‌‌‌‌‌‌, డెబిట్‌‌‌‌‌‌‌‌ కార్డుల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తిస్తున్న బాధితులు సైబర్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌కు కంప్లైంట్‌‌‌‌‌‌‌‌ చేసే వరకే మోసగాళ్లు డబ్బులను వాడుకోవడం గానీ, మరో అకౌంట్‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం గానీ చేస్తున్నారు. దీంతో బాధితుల డబ్బులను హోల్డ్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోతున్నారు. బ్యాంకర్లు మాత్రం ఓటీపీ నంబర్‌‌‌‌‌‌‌‌ ద్వారానే ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌ జరిగినందున డబ్బులు బాధితులే కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే అంబుడ్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సాయంతో మోసపూరిత లావాదేవీలను గుర్తించడం బ్యాంకర్లకు సాధ్యం అవుతుందని, కానీ ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్‌‌‌‌‌‌‌‌ను సాకుగా చూపి వారు తప్పించుకుంటున్నారని సైబర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.