NTV Telugu Site icon

Love jihad: ‘లవ్ జిహాద్’ ముఠా గుట్టురట్టు.. ఇన్‌స్టాలో ఫేక్ ఐడీలతో స్నేహం కట్ చేస్తే..

Love Jihad

Love Jihad

లవ్ జిహాద్ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టి, సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసి, తమ కామప్రాయానికి బలిపశువులను చేసేవారు. అంతే కాదు నిందితులిద్దరూ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవారు. ఇద్దరి నుంచి వేర్వేరు పేర్లతో పలు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా పలు పేర్లతో తయారు చేసిన ఇన్‌స్టా ఐడీ కూడా ఫోన్‌లో లభ్యమయ్యాయి. నిందితుల ఫోన్ల నుంచి పలు అశ్లీల వీడియోలు కూడా పోలీసులు గుర్తించారు.

READ MORE: Noida: వెరీ లక్కీ.. కారు బైక్‌ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్‌పై వచ్చి పడ్డ యువతి (వీడియో)

వివాదం కారణంగా పట్టుబడ్డారు..

ఈ వ్యవహారమంతా ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. పోలీసుల కథనం ప్రకారం.. ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణం నడుపుతున్న ఓ యువకుడు తన దుకాణంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల మధ్య గొడవ జరుగుతుంటం గుర్తించాడు. సందేహం రావడంతో అబ్బాయిల పేర్లను అడిగాడు. ఒకడు తన పేరు రాహుల్ అని చెప్పాడు. అతడి మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఓపెన్ చేయగా అతడి పేరు నౌషాద్ అని తేలింది. దీని తరువాత.. వారిని పట్టుకుని పోలీసు పోస్ట్‌కు తీసుకురాగా.. అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు వారిని విచారించగా.. వారిలో ఒకరు తన పేరు నౌషాద్ అని, మరొకరు తన పేరు అమన్ అని వెల్లడించారు. పోలీసుల విచారణలో నౌషాద్‌, అమన్‌లు హిందూ పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలు సృష్టించినట్లు తేలింది. ఇది కాకుండా.. వారిద్దరి నుంచి 8 వేర్వేరు పేర్లు, చిరునామాలతో కూడిన ఆధార్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

READ MORE:Iran: ఉద్రిక్తతల నడుమ.. కొత్త డ్రోన్‌లు, మిస్సైళ్లని ఆవిష్కరించిన ఇరాన్..

అమ్మాయిలను బ్లాక్‌మెయిల్..

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ” ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద గొడవ జరుగుతున్నట్లు ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడవ పడుతున్న ఇద్దరు అబ్బాయిలను పట్టుకున్నారు. వాళ్ల పేర్లుగ అడగగా.. రాహుల్, సతీష్‌ అని చెప్పారు. వారిని క్షుణ్ణంగా విచారించగా వారి పేర్లను నౌషాద్, అమన్ అని వెల్లడించారు. ఇద్దరి నుంచి ఎనిమిది ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు హిందూ, ముస్లిం పేర్లతో నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలను కూడా కొనసాగిస్తున్నారు. వారిద్దరి నుంచి అమ్మాయిల న్యూడ్ వీడియోలు, ఫొటోలు, అసభ్యకర చాటింగ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నాం. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి పేర్లు దాచి డబ్బులు దండుకునేవారని గుర్తించాం.” అని దేవేంద్ర సింగ్ తెలిపారు.