విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో లో కిడ్నాప్ కలకలం రేపుతుంది. యాజమాన్యంలో ఉన్న మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆగ్రహంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు. మారికవలసలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ హెడ్ గా రమేష్ ను తోటి ఉద్యోగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన దుండగులు శరత్ చంద్రనీ నగ్నంగా చేసి వీడియో రికార్డ్ చేశారు. అయితే, డయిల్ 100కు బాధితుడి భార్య ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.
Read Also: Shubhman Gill: 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా యువ ఓపెనర్
వివరాల్లోకి వెళ్తే.. కైరాన్ కళాత్మిక (ఎంకె కాంక్రీట్ ) లో బిజినెస్ హెడ్ గా పనిచేస్తున్న రమేష్ ను కిడ్నప్ చేశారు. నిన్న (శనివారం) సాయంత్రం షీలానగర్ లో రమేష్ కారులో కిడ్నాప్ చేసి.. మారికవలస గెస్ట్ హౌస్ లో మౌనిక, శశికాంత్, వంశీకృష్ణ, రాములు అనే నలుగురు బందించారు. రూంలో మూడు గంటల పాటు దాడి చేసినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, గాజువాక పోలీసులు స్పందించి విచారణ ప్రారంభించి నిందితుల ఫోన్ లు ట్రేస్ చేశారు.
Read Also: Yash: ఆ సినిమాకు రూ. 150కోట్లు డిమాండ్ చేసిన రాఖీ భాయ్.. ?
ఇక, రమేష్ భార్య 100 కు డైల్ చెయ్యడంతో వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించారు. అయితే, రాత్రి పది గంటల సమయంలో తిరిగి షీలానగర్ లో బాధితుడు రమేష్ ని సదరు నిందితులు దించేశారు. అదే సమయంలో అక్కడే మకాం వేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ (ఐదు సెక్షన్లు ) కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.