Site icon NTV Telugu

Hyderabad: బాచుపల్లి సూట్ కేస్ హత్య కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు..

Murder

Murder

హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు చివరికి ఈ కేసును చేధించారు. ఈ కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మే 23న ఓ యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘోరమైన ఘటన వెనక నేపాల్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:Covid 19 Update: 498 కొత్త కరోనా కేసులు.. నలుగురు మృతి!

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన తోరాను విజయ్ ట్రాప్ చేశాడని తెలిపారు. తోరాకు ఇప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన తోరాను నేపాల్ నుంచి తీసుకొని ఇండియాకు వచ్చాడు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత తోరా ,విజయ్ కాపురం పెట్టారు. కొన్ని రోజుల క్రితమే గర్భము దాల్చింది తూరా. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అబార్షన్ చేయించుకుంటానని విజయ్ పై ఒత్తిడి తెచ్చింది తోరా.

Also Read:Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్

పిల్లల్ని కని నేపాల్ కు తీసుకొని వెళ్దామని విజయ్ మొండికేశాడు. విజయ్ డిమాండ్ ని ఒప్పుకోకపోవడంతో తోరాకి ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం కూకట్‌పల్లిలో ట్రావెల్ బ్యాగుని కొనుగోలు చేశాడు. ట్రావెల్ బ్యాగులో తోరా డెడ్ బాడీని పెట్టి బాచుపల్లి ప్రాంతంలో విజయ్ పడవేశాడని పోలీసులు వెల్లడించారు. గంటల వ్యవధిలో తోరా చంపిన విజయ్ ని పట్టుకున్నట్లు తెలిపారు.

Exit mobile version