Site icon NTV Telugu

Police Constable: కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Police

Police

Police Constable:భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్‌ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్‌ ఆస్మాన్‌ఘడ్‌ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్‌ కిరణ్‌ (36) ఫిల్మ్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను భార్యతో తరచూ గొడవపడేవాడు. నాలుగైదు రోజులుగా సెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్న కిరణ్‌, మంగళవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఆ ఘటన అనంతరం బుధవారం సాయంత్రం అతను ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: TGTET Exam: నేటి నుంచి ప్రారంభంకానున్న టెట్​ పరీక్షలు.. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు

ఇరుగు పొరుగు వారు, బంధువులు అతన్ని మలక్‌పేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Also Read: Rythu Bharosa: నేడే రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ సమావేశం

Exit mobile version