NTV Telugu Site icon

2 Thousand Crores: 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు.. ఆర్బీఐ నగదుగా తేల్చిన పోలీసులు

Cash Cantainers

Cash Cantainers

2 Thousand Crores: ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు భారీ నగదుతో వెళ్తున్న కంటైనర్లను పట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. 4 కంటైనర్ల నిండా నగదు పట్టుబడింది. ఒక్కో కంటైనర్ లో రూ.500 కోట్ల చొప్పున మొత్తం రూ.2 వేల కోట్లు ఉన్నట్టు గుర్తించారు.

Read Also: Ajeya Kallam: ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోంది..

పోలీసులు ఈ కంటైనర్లలోని డబ్బుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ నగదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదని తేల్చారు. ఈ రూ.2 వేల కోట్ల నగదును ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తోందని అధికారులు తెలిపారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం, కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకీ కంటైనర్లు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండడంతో ఆ కంటైనర్లను అధికారులు పంపించివేశారు.