NTV Telugu Site icon

Police Case: I-N-D-I-A పేరును అక్రమంగా ఉపయోగించారని పోలీస్ కేసు

Opposition

Opposition

దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరును పెట్టుకోవడం తెలిసిందే. అయితే ఆ పేరును తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్నట్లు పోలీస్ కేసు నమోదైంది. I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 1950 నాటి ఎంబ్లమ్స్ యాక్ట్‌లో పొందుపరిచిన అంశాల ఆధారంగా ప్రతిపక్ష కూటమి ఆమోదించుకున్న పేరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పేరు సదరు చట్టానికి విరుద్ధంగా ఉందని.. విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారు కోరారు. అంతే కాకుండా ఈ పేరును పెట్టుకోవడం ద్వారా 26 రాజకీయ పార్టీలు దేశం పేరును దుర్వినియోగం చేశాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

Niranjan Reddy: వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి

నిన్న (జూలై 19) బెంగళూరులో విపక్ష పార్టీల నేతల సమావేశంలో ఈ పేరును అందరూ ఆమోదించుకున్నారు. ‘భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్ఠి కూటమి’గా పేరును నిర్ణయించాయి. రాహుల్ గాంధీ ఈ పేరును ప్రతిపాదించారని.. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పేరును మల్లిఖార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు. I – ఇండియా, N – నేషనల్, D – డెమొక్రాటిక్, I – ఇంక్లూజివ్, A – అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు. అంతకుముందు యూపీఏ (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియన్స్) ఉన్న సంగతి తెలిసిందే. బెంగళూరులో నిన్న జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 26 విపక్ష పార్టీలు పాల్గొన్నాయి.