NTV Telugu Site icon

Prostitution : షాకింగ్‌.. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. 14 వేల అమ్మాయిలకు విముక్తి..

Prostitution

Prostitution

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన 17 మందిని సైబరాబాద్ పోలీసుల అరెస్ట్ చేశారు. అయితే.. ఈ సెక్స్‌ రాకెట్‌లో14,190 మంది బాధితులని విముక్తి కలిగించారు సైబరాబాద్ పోలీసులు. 39 కేసుల్లో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ,ముంబై తో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాల చెందిన బాధితులకు విముక్తి కలిగించినట్లు తెలుస్తోంది. పలు వెబ్‌సైట్‌లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తోంది ఈ ముఠా. అయితే.. ఉపాధి పేరుతో తీసుకువచ్చి వ్యభిచారం రొంపిలోకి అమ్మాయిలను దింపుతున్నారు.
Also Read : Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!

లగ్జరీ లైఫ్ అంటూ ఆశలు రేపి వారికి మత్తు మందులు అలవాటు చేసి వ్యభిచారంలోకి దించినట్లు సమాచారం. అయితే.. పలు వైబ్‌సైట్‌లను ఏర్పాటు చేసిన ఎస్కార్ట్‌ పేరుతో ఈ చీకటి దందాను కొనసాగిస్తున్నారు. అయితే.. జాబ్ లేని అమ్మాయిలను, పేదరికం లో ఉన్న అమ్మాయిలను జాబ్స్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని, విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాలకి కస్టమర్లు దగ్గరకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అరెస్ట్‌ చేసిన 17 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది.