Site icon NTV Telugu

Anchor Swetcha: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు.. పూర్ణచంద్ర నాయక్ కు రిమాండ్

Poorna Chandar

Poorna Chandar

ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ బలవర్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా తమ కూతురు ఆత్మహత్యకు పూర్ణ చందర్ నాయక్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో పూర్ణ చందర్ స్వేచ్ఛకు తనకు మధ్య ఏర్పడిన పరిచయం గురించి వెల్లడిస్తూ లేఖ విడుదల చేశారు. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం. మేము ఇద్దరము T-NEWS లో పని చేసే వాళ్ళము. T-NEWSలో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళమని తెలిపాడు.

Also Read:Amit Shah: పాకిస్థాన్‌ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోంది.. అమిత్ షా ఆగ్రహం..

2009 నుంచి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్చ 2020 నుంచి నాకు దగ్గరైన మాట వాస్తవమే అని లేఖలో పేర్కొన్నాడు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచంద్ర నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణచంద్ర నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అతనిపై బి.ఎన్.ఎస్ యాక్ట్ 69 , 108 యాక్ట్ తో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టారు.

Exit mobile version