Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం వెలగపల్లి ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగుచూశాయి. సీతపల్లి వాగుపై వంతెన లేకపోవడంతో గ్రామస్తులు ప్రాణాలను పణంగా పెట్టి తాడు సహాయంతో వాగు దాటుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులను కూడా ఇదే విధంగా తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
దేవీపట్నం మండలం వెలగపల్లి సమీపంలోని సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం, గుంపెనపల్లి గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో తాడు సహాయంతోనే వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేత పట్టుకుని వాగు దాటుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ బాలుడిని వైద్యం కోసం దామనపల్లి ఆసుపత్రికి తరలించేందుకు అతని తండ్రి వాగు మధ్యలో తాడు పట్టుకుని దాటించిన ఘటన స్థానికులను కలచివేసింది. వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ మరో మార్గం లేక గిరిజనులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నారు.
Also Read
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
ఏళ్ల తరబడి సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, అత్యవసర వైద్య సేవలు, విద్య, నిత్యావసరాల కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. వెంటనే వంతెన నిర్మించి తమ కష్టాలకు ముగింపు పలకాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?