MLA Chirri Balaraju: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజుకు జనసేన కార్యకర్తలు ఎంతో ఇష్టంతో ఓ కారును కొనిచ్చారు.. రెండు రోజుల క్రితం ఆయనకు జనసైనికులు కారును బహుకరించారు.. అయితే, గిఫ్ట్‌గా ఇచ్చిన కారును తిరిగి వెనక్కి ఇచ్చేశారు ఎమ్మెల్యే.. డౌన్ పేమెంట్ తో టయోటా ఫార్చునర్ కారు కొన్న జనసైనికులు.. మంగళవారం రోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్టుగా అందించారు. దీనికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.. తనపై అభిమానం చూపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే విషయంలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తానని.. అందుకే కారు వెనక్కి చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఏడేళ్లుగా పోలవరం నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్నానని.. ఇదే తరహాలో ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన చిర్రి బాలరాజు.. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగాలన్నా.. అసెంబ్లీకి వెళ్లాలన్న.. ఇతర సమావేశాలు, సమీక్షలు, మీటింగ్‌లకు వెళ్లాలన్నా.. ఇబ్బందిగా ఉందని గుర్తించిన జనసైనికులు.. తమ నేత కోసం అంతా చందాలు వేసుకున్నారు.. కరాటం రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు.. బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు కొంత నగదు సేకరించారు.. ఆ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి.. టయోటా ఫార్చ్యూనర్ కారు బుక్ చేశారు.. ఆ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్ట్‌గా అందించారు.. మిగతా మొత్తాన్ని ఎమ్మెల్యేకు నెలవారి వచ్చే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు అభిమానులు.. మొత్తంగా తమ ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ, వారి అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూనే.. సున్నితంగా ఆ కారును వెనక్కి పంపించారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.